పుట:Aliya Rama Rayalu.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొల్పినది? ఇంక నీతడు విజయనగర సామ్రాజ్యమున దాను బట్టాభిషిక్తు డగుటకు నడ్డుపడ సామర్థ్యముగల వారెవ్వరు లేరని తలంచెను. అంత ధైర్యసాహసములు ముప్పిరిగొన సామ్రాజ్యవజ్రసింహాసనము నాక్రమించి యధిష్టింప జూచెనుగాని తనకు రాబోవుముప్పు నెఱుంగడయ్యెను. అతనిస్వామిద్రోహమున కెంతయు దు:ఖపడుచున్నవారయినను, కొందఱు ప్రభువు లతనియధికారమునకు లోపడియు, నతడుగావించు దౌష్ట్యములకు మనస్సు విఱిగిపోయిన వారయి విజాపురసుల్తాను ఇబ్రహీముతో గుట్రలుచేయ నారంభించి సలకముతిమ్మయ నధికారపదవినుండి తొలగించినయడల విజయనగరసామ్రాజ్యకిరీటము నాతని కొసంగి శతవిధముల తోడ్పడ గల వారమని వాగ్దత్తము చేసిరనియు, దీనినంతయు దెలిసికొన్న వాడయి యాద్రోహి తనకిష్టు డైనవాని నొకరాయబారిని సిద్ధముచేసి వానిపరముగా నాఱులక్షల హొన్నులద్రవ్యము నొసగి యీధనము విజాపురసుల్తా నగుఇబ్రహీమున కిచ్చి తనకు తోడ్పడవలసిన దనియు, నట్లుతోడ్పడిన యెడల తానతనికి సామంతుడ నైయుండుటయెగాక యీయుపకారమునకు బదులుగా దారిబత్తెములకుగాను దినమునకు మూడులక్షలహొన్నుల నదనముగా నిచ్చుటకు సంసిద్ధుడనై యున్నాననియు, నాపక్షమున నచ్చజెప్పి వానిదోడ్కొని రావలసినదని ప్రోత్సహించి యారాయబారిని విజాపురమునకు బంపించెననియు, అనాయసముగా లభించెడు నీలక్ష్మీ పదవికి