పుట:Aliya Rama Rayalu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందలి సామ్రాజ్యవైభవ మింతయంత యని చెప్ప నలవికాదు. సామ్రాజ్యమునందు నత్యల్పకాలములో నతివేగమున బదిపదునైదులక్షల సైన్యమును సమకూర్ప వచ్చును. ఈసామ్రాజ్యమున నప్పటికి మూడువేలయేనుగులతో గూడిన గజసైన్యమును, అరాబియా, పారశీకములనుండి రప్పించిన నలువదివేల గుఱ్ఱములతో గూడిన యాశ్విక సైన్యమును గలదు. ధనికులయిన సామంతమాండలికు లైనప్రభువులు పెక్కండ్రు గప్పములు చెల్లించువారు గలరు. సమీపస్థులయిన పెక్కండ్రుమహారాజులు సామ్రాజ్యమునకు లోబడినవారుగా నుండిరి. ఇదిగాక యీసామ్రాజ్యమునందలి నదులలో బంగారమును, కనుమలలో వజ్రములు మొదలగు నవరత్నములు లభించుచుండెను. ఎన్నివిధములచేత బరిశీలించి చూచినను నాకాలమున విజయనగర సామ్రాజ్యము మహోచ్చస్థితియందుండి శత్రువులకు గన్నెఱ్ఱ సలుపు చుండెనన్న నతిశయోక్తియెంతమాత్రమును గా జాలదు. ఇట్టిసామ్రాజ్యమునకు నొకబాలు డధిపతికావలసి వచ్చెను. తత్సామ్రాజ్యభారనిర్వాహకకర్త దురాశాపీడితుడు దుర్మార్గుడు నయ్యెను.

సలకముతిమ్మరాజు - రామరాయలు

అంత:పురములోని రాణులకును మాండలికులయిన ప్రభువులకును, పెక్కండ్రుజనులకు గూడ సామ్రాజ్యభారము సలకము చినతిమ్మరాజు వహించుట సమ్మతముగా