పుట:Aliya Rama Rayalu.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సముద్రతీరమునందలిప్రళయకావేరి) నుండి యచట బరిపాలనము సేయుచున్నమాండలిక ప్రభువురామరాయలు విద్యానగరమునకు బయలుదేఱి వచ్చెనని 'కోఱియా' యనునాతడు వ్రాసి నట్లుగ నారవీటివంశచరిత్రమునందు వక్కాణింపబడినదికావున సామ్రాజ్యభారమునంతయు వహించిన రామరాయలంతటివాడు దూరదేశమున బ్రళయకావేరి యందొకపాలకుడుగా నుండి సామ్రాజ్యధిపతిమరణకాలమునకుమాత్రమె విద్యానగరమునకు వచ్చుటసంభవించి యుండదు. ఈయచ్యుత దేవరాయలమరణానంతరము సంభవించినచరిత్ర విషయములను బట్టి కూడ నీకాలమున నీసోదరద్వయ మంతగా బ్రాముఖ్యత వహించి యున్నట్లు గన్పట్టదు. వారెట్లో మౌనముతో దూరముననుండి కాలము గడుపుకొన్నటుల గనంబడుచున్నదిగాని యచ్యుతదేవరాయల పలుకుబడిగలిగి సామ్రాజ్యవ్యవహారముల జోక్యముకలిగించుకొని యంతగా వ్యవహరించినటుల గనుపట్టదు. తిరుమలాంబ విరచితమైన 'వరదాంబికా పరిణయ' మను గ్రంథమున దుళువనరసింహరాయలు దివసకర కులోత్తంసు డయినరాచిరాజునకు శ్రీరామాంబిక గర్భమున జనించినయౌబమాంబను వివాహము చేసికొనగా నామెవలన నాతనికచ్యుతరాయలనుకుమారుడు కలిగె ననియు, ఆకుమారునకు సలకరాజుపుత్రులగు తిరుమలరాజను నామములుగలిగి యచ్యుతదేవరాయలకు మంత్రులుగ నున్న యిర్వురసోదరులకు చెల్లెలుగ నున్నవరదాంబిక వివాహముగావింపబడె ననియు,