పుట:Aliya Rama Rayalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననిఫెరిస్తావ్రాసినాడని హీరానుఫాదిరి తనయారెవీటివంశచరిత్రమున వ్రాసినది నప్రమాణముకాదు [1]

శ్రీరంగరాజుభార్య తిమ్మాంబయనియు, ఆమెవలన శ్రీరంగరాజునకు, కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటాద్రిరాజు నను నైదుగురుకొమాళ్లు జనించిరనియు వసుచరిత్రలోని యీక్రిందిపద్యములవలన దెలియుచున్నది.

    "కం. ఆమనుజేంద్రునకు బురం
         ధ్రీమణి యగుతిమ్మాంబ శ్రీరామునకున్
         భూమిజసుత్రామునకు బు
         లోమజయునుబలె జగంబులో నుతికెక్కున్."

    "శా. చేతోజాతసమానమూర్తి యగు నాశ్రీరంగధాత్రీధవుం
        డాతిమ్మాంబికయందు గోనవిభు దిమ్మాధీశురామప్రభున్

  1. "WE know from Ferishta that he was one of the Ministers of Krishna Deva Raya, and was succeeded in this place by his son Rama Raya." (The Aravidu Dynasty of Vizianagar OH. II. page 19.) ఫెరిస్తావ్రాసిన వాక్యములను బ్రిగ్సు యిట్లు భాషాంతరీకరించెను. "The affairs of Beejanuggur being in confusion owing to the death of Hoeinraju who was newly succeeded by his sona Ramaraju, against whom rebellions had arisen by several Roies, he (the Sultan) met with no interruptions to his arms.(Brigg's Ferista Vol. III p. 81.) "హీమ్రాజుమరణము జెందగా నూతనముగా నాతనిపదవిని బొందిన యాతనికుమారుదు రామరాజుపై ననేకరాజులు తిరుగబడినందున విజయనగరములోని వ్యవహారములు గల్లోలము జెందుటచేత నతని (సుల్తాను) యాయుధముల కడ్డంకులు లేకుండెను" అని యావాక్యముల కర్థము. ఫెరిస్తావ్రాసిన పైవాక్యముల నమ్మి 'విస్మృతసామ్రాజ్యము' (Forgotten Empire p. 81.) అనుపేరుతో విజయనగరసామ్రాజ్య చరిత్రమువ్రాసినగొప్పచరిత్రకారులగు రాబర్టుస్యూయల్‌గారు "Heem' Rajah or, as Briggs renders the name Tim-Rajah-representing the 'Timma' are referring doubtless to saluva Timma, the great Minister of Krishna Deva Raya." అనివ్రాసి హీమ్రాజు కొడుకైన రామరాజు కృష్ణదేవరాయలప్రధానమంత్రిశేఖరు డగు సాళువతిమ్మరుసు కుమారు డని నిర్ధారణ చేసిరి. ఇదెంతవింతగానున్నదో చూడుడు. అళియరామరాజు తండ్రి న్యూయలను కొన్నట్టు సాళువతిమ్మరాజు కాడనియు, శ్రీరంగరాజనియు దేటపడుచుండ లేదా. ఫెరిస్తానిష్పక్షపాతమైనట్టియు సరియైనట్టియు చరిత్రము వ్రాయలేదని యెఱింగియుండియు హిరాసుపాదిరి ఫెరిస్తామాటలనమ్మి శ్రీరంగరాజు కృష్ణదేవరాయలప్రధానమంత్రి యని వ్రాయుట సత్యముకాదు.