పుట:Aliya Rama Rayalu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        ధౌరంధర్యముచే నా
        శ్రీరంగాధీశుడనగ క్షితిమతి గాంచెన్"

అనివ్రాసెనేకాని యాతనింగూర్చిన చరిత్రాంశము నొక్కదాని నైన నుడివియుండలేదు గాని,

       "కాగనసదృశబాహువిక్రమ నిరూడి
        దనరె గర్ణాటరాజ్యపదస్థు డగుచు
        దుర్జయాహితరాజ విధుంతుదుండు
        రామరాజేంద్ర శ్రీరంగరాజవిభుడు."

అని చెప్పియుండెను. దీనింబట్టి యీశ్రీరంగరాజు విజయనగరరాయల యాసానమున నుండి నట్లూహింప దగియుండెనుగాని యంతకన్నవిశేష మేమియును గానరాదు. మఱియు వసుచరిత్రమును రచించిన రామరాజభూషణకవి (భట్టుమూర్తి) సయితము

   "శా. ఆరాజత్రితయంబులో నసమభాణారాతి విజాతదో
       స్సారుం డాత్తసుభద్రు డర్జునగుణశ్లాఘ్యుండు నై పొల్చునా
       శ్రీరంగేంద్రుడశేష రాజ్యపదవీసింహాసనాక్షీణ ల
       క్ష్మీరాజన్నిజ సంతతిప్రధితుడై మించెన్ ధరామండలిన్"

అని యభివర్ణించెనేగాని యొక్కచరిత్రాంశము నైన బేర్కొనినవాడు గాడు. ఇతడు కృష్ణరాయనికిమంత్రిగ నుండె