పుట:Aliya Rama Rayalu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


       మన్నెదళధూమకేతువ
       మన్నియమృగబేటకార మాళవరాయా
       త్యున్నతమస్తకశూలా
       మన్నెరసురత్రాణబిరుద మన్నెవిభాళా'


అనుపద్యములలో 'మాళవ రాయాత్యున్నత మస్తక శూలా' యనుబిరుద మితనిపూర్వు డగుసోమదేవరాజు కదనరంగమున మాళవరాజునుజయించి సంపాదించినదిగాని యితడు సంపాదించినది కాదు. కావున వీనిపూర్వులు వహించినబిరుదములు కొన్నియీతనికిని జేర్చ బడినది. ఇతడు పట్టవాడ రాజును, ఉద్దండరాయ డనువానిని జయొంచినట్లు పై పద్యములవలన దెలియుచున్నది.ఇతడు కళింగదేశాధీశ్వరుడగునొడ్డియరాయని, జయించుటయెగాక మహమదమలకకు బ్రాణదాన మొసగినట్టు కూడ నీక్రిందిపద్యమున సూచింపబడినది.


      "కదనధనంజయునకు మహ
       మదమల్కప్రాణదాన మతికొడ్డియరా
       యదిశాపట్టున కరిరా
       యదళవిభాళునకు పాండవాన్వయపతికిన్."

ఇతడు శ్రీకృష్ణదేవరాయలవారి పట్టాభిషేకసమయమున రాజసభయందుండి తరువాత కృష్ణరాయల పూర్వదిగ్విజయయాత్రలో పాల్గొన్నట్టు కుమారధూర్జటి తనకృష్ణరాయవిజయమునందు "సాకల్యముగ గీర్తిసర్వదిక్తటు లందు