పుట:Aliya Rama Rayalu.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నబలపరాక్రమధుర్యుడై బహుప్రసిద్ధిని గాంచినవాడుగ నున్నాడు.

అవుకుతిమ్మరాజు

రామరాజునకు లక్కమాంబ యందుజనించినమూవురు పుత్రులలో బెద్దవాడయినతిమ్మరాజు 'అవుకు' పురము నేలు చుండినవా డగుటవలన దరువాత నతనిసంతతివారు చరిత్రము నందును, ప్రబంధములలోను నౌకువా రని వ్యవహరింప బడిరని నరపతివిజయములోని:-


      "కం. ఆతిమ్మనృపతిభూకాం
           తాతిలకం బైనయవుకు దానేలుచు వి
           ఖ్యాతిగ నప్పురిపేరం
           బ్రీతిని దనకులము వెలయ బెంపొందె మహిన్."

అనుపద్యమువలన విదిత మగుచున్నది. కనుక నీత డవుకువంశమునకు మూలపురుషు డయ్యెను. దోనేరు నాధకవివిరచిత మగుద్విపదబాలభాగవతమును గృతి నొందిన చినతిమ్మరాజు ప్రేరణచే నేతద్గ్రంథకర్త యగుకోనేరునాథకవి పద్యబాలభాగవతమును రచించి యతనితండ్రియగు నీతిమ్మరాజునకు నంకితము గావించెను. ఈకృతియందునితనికిసంబంధించిన పెక్కుచారిత్ర కాంశములు దెలుప బడి యున్నవి. ఇతడు క్రీ. శ. 1505 మొదలుకొని క్రీ. శ. 1542 వఱ