పుట:Aliya Rama Rayalu.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ష్ఠించి 1500 లలో దక్షిణదిగ్విజయయాత్రకు బయలు వెడలెను. పైదానివలన ఆరెవీటిరామరాజుచే నిర్జితు డైనహల్లీసుసేనుడును, ప్రతాపరుద్రగజపతికి శరణాగతుడై సంరక్షింపబడిన 'హుసేనసాహి'యు నేకకాలమువారగుట నిజము."

అయినను 'వీరొక్కరా భిన్నపురుషులా యనునది చింతింప దగినవిషయ' మని వేంకటరమణయ్యగా రనుచున్నారు గాని వీరుభిన్నపురుషులు కారనియే నాయభిప్రాయము. క్రీ. శ. 1500 లలో ప్రతాపరుద్రగజపతి దక్షిణదిగ్విజయయాత్రకు బయలువెడలిన వాడగుటచే నాదండయాత్ర సందర్భమున నావిషయము జరిగియుండును. బిరుదుగద్యములో వేంకటరమణయ్యగారు వ్రాసినట్లు 'సప్తదశసైంధవగ్రహణ' గాక రంగస్వామిసరస్వతిగారి పాఠమున వక్కాణింపబడినట్లు 'సప్తశతసైంధవగ్రహణ' మనియె గ్రహింపదగి యుండును. రామరాజు హల్లీసుసేనుని జయించి 700 గుఱ్ఱములను గైకొన్నవాడు.

ఆరెవీటిరామరాజునకు నల్వురు భార్యలు గలరని బాలభాగవతమునందు,


      "ఆరామభూపతి కంగనామణులు
       పేరైన యౌబళాంబిక లక్కమమ్మ
       యంబుజనేత్రరంగమ్మయు నమల
       మాంబయు నల్గు రై రందులోన"