పుట:Aliya Rama Rayalu.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వానిసప్తాఙ్గములను హరించె నని దెలుపబడి యుండెను. ఆదివేనిదుర్గము మిక్కిలి బలాడ్యమైనది ఈదుర్గాధిపతి యైనకాచాధీశునిపై రామరాజేల దండెత్తివలసివచ్చె ననిసంశయము పుట్టగలదు. కాని రామరాజు కాలమునుబట్టి విచారించిన దగునట్టికారణ మగుపించక పోదు. కాచయొడయడు విజయనగరసామ్రాజ్యమును మొదట బరిపాలించిన సంగమవంశీయుల పక్షమువాడయి క్రీ. శ. 1487 వ సంవత్సరప్రాంతమున సాళ్వనరసింహరాయలు విజయనగరసామ్రాజ్య మాక్రమించుకొన్నప్పు డాతనికి వ్యతిరేకముగ బ్రవర్తించి యుండును. ఆరెవీటిరామరాజు సాళ్వనరసింహరాయని పక్షమున వహించి యాదవేనిపై దండయాత్ర సాగించి యాతనిసప్తాంగములను హరించి యాదుర్గమునకు దనరెండవ కుమారుడైనకొండ్రాజును నధికారిగ నియమించి యుండును. ఇంక రెండవబిరుదమును గుఱించి విమర్శింతము. ఈబిరుదములోని హల్లీసుసేనుని గూర్చి శ్రీనేలటూరివేంకటరమణయ్యంగా రిట్లు వ్రాసియున్నారు.[1]

"క్రీ. శ. 1492 మొదలుకొని 1528 వఱకు కళింగ దేశముపై ప్రభుత్వముసల్పిన ప్రతాపరుద్రగజపతి తన 'సరస్వతీవిలాసము'లో జమునాపురాధీశ్వరు డగు 'హుసేనసాహి' యనుతురుష్కుడు శరణాగతుడు కాగా శత్రువుల నుండి వానినిరక్షించితి ననిచెప్పుకొని యున్నాడు....... ప్రతాపరుద్రగజపతి క్రీ. శ. 1492 లోసింహాసనము నధి

  1. భారతి సం. 6 సంచిక 6.