పుట:Aliya Rama Rayalu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధైర్య, దుర్వారతరసవాయిసైనికహరణ, నవాబిబ్బిరాజసప్తాఙ్గహరణమార్గచరణ, రణభయానక ఙయానకారవముఖరీకృతకుల గిరిదరీనికర, పోషితావనిసురకరప్రకర, నిరావాపాదవనీదుర్గనివాసి కాశవొడయదుర్మదఖలనిర్మధన, ధర్మధౌరేయ, దానరాధేయ, వీరరమానమారోహణారంభ సోపానదోస్తంబ, వాక్కుంభీనససార్వభౌమారంభ, పరిపంధినృపపుండరీకాధిపరాజ మండలకబళనవ్య గ్రిమోదగ్రమండలాగ్ర, సింహికాతనూజ, రామరాజ, విజయీభవ."

పైబిరుదగద్యములో 'దుర్వారతర సవాయిసైనికహరణ, సవాబిబ్బిరాజసప్తాఙ్గహరణమార్గశరణ' అనుబిరుదముల వహించుటకు గారణము విజాపురసుల్తానగుఆదిల్‌షాహాను జయించుటయని మనము తెలిసికొన గలుగుచున్నాము. 'నివాపాదవనీదుర్గనివాసి కానవొడయదుర్మదఖిలనిర్మధన' యన్న బిరుదము వచ్చినవిధమును, 'హల్లీసుసేనోల్లాసితసప్తశతసైంధవగ్రహణపరాక్రమధుర్య' యను బిరుదమును వహించుటకు గలకారణమును దెలిసికొనవలిసి యుండును. మొదటిదానిగూర్చి ద్విపదబాలభాగవతమునందు,

       "వినుతింప దగునాదవేనిదుర్గమున
        ననతుడై యుండుకాచాధీశు గెలిచి
        అరుదుగా సప్తాఙ్గహరణంబు సేసె
        గరిమోన్నతుండు బుక్కయ రామవిభుడు."

      అని యాదవేనిదుర్గాధీశు డయినకాచాధీశుని జయించి