పుట:Aliya Rama Rayalu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


      "సీ. మదకరి కొకటి కిర్వదిగుఱ్ఱములు గుఱ్ఱ
                మునకును విలుకాండ్రు ముగురు విచ్చు
          కత్తులవా రీటెకాం డ్రట్ల వర్థిల్ల
                నిట్టి యేనుగులను జుట్టు మూడు
          వేల యేనూరు నుద్యృత్తితో నడవంగ
                గందనో ల్సాధింపగా దలంచి
          మొన ద్రుంచి గట్టిగా ముట్టడి దిగిన నా
                బిబ్బిని మిక్కిలి యు బ్బణంచి

       గీ. ప్రకట సప్తాంగముల గొని రామవిభుడు
          కందనో ల్రాజధానిగాగ వసుమ
          తియును నేలి మహాహవదీక్ష బూనె
          బలిమి కలిమి నాశావనీపకుల బెనుప."

అనగ రామరాజుసైన్యము 3,500 ఏనుగులు, 70,000 గుఱ్ఱములు, 6,30,000 కాల్బలము గలదిగ నుండెనట. ఇట్టిమహాభయంకర మైనసైన్యముతోనుండి, డెబ్బదివేల యాశ్వికసైన్యముతో దండెత్తివచ్చి కందనవోలును ముట్టడించిన సవాబిబ్బీని (విజాపుర సుల్తానగు అదిల్‌షాహ) నోడించి తరుమ గొట్టి యుబ్బణగించిన దర్పోన్నతు డయినరణశూరునిగ వర్ణించి యున్నాడు. ఇతనిబిరుదుగద్య మిట్లున్నది.

"జయజయ, స్వస్తిసమసుప్తిసమరసమయబలరజోమి ళితసప్తసాగరఘంఘుమితకల్లోలజాల, శరణాగతపాల, హల్లీసుసేనోల్లాసితసప్తశతసైంధవ గ్రహణపరాక్రమధుర్య, రత్నసాను