పుట:Aliya Rama Rayalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గందనోలుపట్టణమున కధీశ్వరునిగ జేసెను. ఈరామరాజు కందనోలుపట్టణమున నుండ విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షాహ డెబ్బదివేలయాశ్వికసైన్యముతో వచ్చి ముట్టడించె ననియు, వానితో బోరాడి విజయము గాంచె నని బాలభాగవతములోని,


      "ఎందు నెన్నగ జాలు నిద్ధశౌర్యమున
       గందనవోలిదుర్గంబులోనుండి
       బుక్కయరామభూభుజు డెలనృపుల
       నెక్కువ యిదియని యెన్నంగ జాలి
       వీరులు డెబ్బదినేవు రాశ్వికులు
       చేరి కొల్వంగవచ్చినసవానెదిరి
       కలనంది పంచబంగాళంబు సేసి
       గెలిచె దచ్చరితంబు గీర్తింప దరమె.

     అనుపంక్తులవలనను, పద్యబాలభాగవతములోని,

  "గబ్బుల్ డెబ్బదివేవు రాశ్వికులు వేడ్కన్‌గొల్వగాగిన్కబె
   న్మబ్బుల్ గప్పగగందనోలుగొనువేడ్కన్‌జుట్టుముట్టన్‌సవా
   బిబ్బీ నుబ్బణగించి తోలె నరిరాడ్భీముండు లంకాసర
   ణ్యబృంద్రాభుడు బుక్కభూవిభుని రామాధీశుం డాహాయనన్."

అనుపద్యమువలనను విస్పష్టమగు చున్నది. ఇతని కెంత సైన్యముగలదో యావివరము నరపతివిజయమునం దిట్లు చెప్పబడినది.