పుట:Aliya Rama Rayalu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగుకొడుకులు జనించిరి. సింగరాజునంద్యాలపట్టణమున కధీశ్వరుడుగ నియమింపబడి పరిపాలించుటవలన నీతనివంశము వారికి నంద్యాలవారనియింటిపేరు గలిగినది. బుక్కరాజు రెండవభార్యయగుబల్లాంబికయందు ప్రకటగుణాడ్యు డగురామరాజు జనించెనని నరపతివిజయము నందు దెలుపబడినది. బాలభాగవతమునందు,

      "ఆమహీపతికి బల్లాంబిక యందు
       రామనృపాలుండు రాజేంద్రు డొదవె
       హరిపాదతీర్థంబునందు బాంధవులు
       గరళంబు వెట్టినగతి యెఱింగియును
       తెఱగొప్ప తత్తీర్థంబు నాని
       యరిగించుకొనియె రామావనివిభుడు."

       అనియును, నరపతివిజయమునందును,

  "చ. మగటిమి కోర్వలేక దయమా లటుజ్ఞాతినియుక్తబుద్ధిచే
      సగరత గన్నతీర్థ మిడజాలక యర్భకు డున్నజూచి శ్రీ
      నగధర నీవె దిక్కని జనంబులు గన్గొన నంత గ్రోలి యా
      సగరుని బోలి రామనృపచంద్రుడు చెందడు తద్వికారమున్."

అనియును రామరాజు మాహాత్మ్యము గొనియాడ బడియుండెను. ఇతనికి విషము బెట్టినజ్ఞాతులగుబంధువు లెవ్వరో ఎందుకు వారు విషము బెట్టవలసివచ్చెనో యావివరము నేకవియును దెలిపియుండ లేదు. ఆరెవీటిబుక్కరాజు రామరాజును