పుట:Aliya Rama Rayalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేష, అసహాయశౌర్య, సుమేరుధైర్య, అష్టాదశవిద్యాప్రజ్ఞాప్రవీణ, రాజకులాభరణ, రాజరాజేశ్వర, పిన్నశౌరిరాజతనూజ, బుక్కరాజ విజయీభవ, దిగ్విజయీభవ."

ఇతడు మిక్కిలివృద్ధుడగువరకు దీర్ఘకాలము జీవించి మునిమనుమలజూచు నంతవఱకు, అనగా శ్రీకృష్ణదేవరాయలవారిపట్టాభిషేకమువఱకు జీవించి యుండె నని,

       "చక్కెరవిలుకాని చక్కందనము గల్గి
        చొక్కమౌ నార్వీటి బుక్కరాజు"

అనికుమారధూర్జటికవి తనకృష్ణరాయవిజయమునందు కృష్ణరాయలపట్టాభిషేకకాలమున నీవృద్ధనృపతి రాజాస్థానము నలంకరించియున్నవా డని యభివర్ణించియుండుటచేత విశ్వసింపవలసి వచ్చుచున్నది. ఇతనిసంతతియెతామంతంపరయై దక్షిణహిందూదేశచరిత్రమునందు బహుప్రఖ్యాతి కెక్కినచరిత్రవంశముగా నున్నది. ఈవంశమె కొంచెమించుమించుగా మున్నూఱువత్సరములు మహమ్మదీయమతస్థులకు స్థావరము గలుగకుండ బోరాడుచుండిన యాంధ్రహిందూరాజవంశమని నిస్సంశయముగ జెప్పవచ్చును. దక్షిణహిందూదేశసంరక్షణార్థ మీరాజవంశము తనకుమారులను బెక్కండ్రను రణభూమికి బలిపెట్టి యసమానకీర్తిని సంపాదించుకొనియెను.

ఆరెవీటిరామరాజు

ఆరవీటిబుక్కరాజునకు అబ్బలదేవి, బల్లాంబిక యనునిర్వురు భార్యలు గలరు. వీరిలో అబ్బలదేవియందు సింగరాజు