పుట:Aliya Rama Rayalu.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సేయుచు దరువాతసామ్రాజ్యము క్షీణించి దురవస్థపాలయి యున్నకాలమున స్వతంత్రుడై క్రీ. శ. 1487 వ సంవత్సరప్రాంతమున సామ్రాజ్యము నంతయు దానేయాక్రమించుకొని శత్రుల నడంచి పట్టాభిషిక్తుడై బలిమిచే 1493 వఱకు బరిపాలించిన వాడగుటచేత నాతని విజయయాత్రలందు నార్వీటిబుక్కరాజు పాలుగొనియుండె ననివిశ్వసింప వచ్చును. ఇంతియగాక యితనిబిరుదుగద్యమున 'సాళువనరసింహ రాయరాజ్య ప్రతిష్ఠాపనాచార్య' అనుబిరుదము గన్పట్టుచుండుట చేతను, బాలభాగవతమునందు పరసఖుం డనిపేర్కొన బడియుండుటచేతను రాజ్యప్రతిష్ఠాపనమునం దీతని ముఖ్యసేనానియగు నీశ్వరనారసింహునివలె నీబుక్కరాయని సాహాయ్యమును సాళ్వనరసింహరాయలు పొందియుండె ననుట కెంతమాత్రమును సందియము లేదు. కనుకనే పద్యబాలభాగవతమునందు,

      "అతడు దను మన్నెపులి యని యఖిలదిశల,
       జెలగి పొగడ సాళువనరసింగరాయ
       రాజ్యసంస్థాపకుం డయ్యె బ్రౌడినారె
       వీటిబుక్కనరేంద్రు డుద్ఘాటితారి."

అని యభివర్ణించి యుండెను. ఇతనిబిరుదుగద్య మిట్లున్నది. "జయజయ, స్వస్తిశ్రీసంతత వేంకటాచలపతి చరణారవిందసేవాకందళితసామ్రాజ్యసుఖోవభోగ, సాళువనరసింహరాయరాజ్య ప్రతిష్ఠాపనాచార్య, శౌర్యగరిష్ఠ, సకలకళావిశారద, దైనందినవితరణ నానాదిగంతరాగతవనీపకజాల పరిపాలనాగుణవి