పుట:Aliya Rama Rayalu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరెవీటిబుక్కరాజు

ఆరెవీటి వంశావళియందు,
   
     "ప్రభవించె నతని కౌబళదేవియందు
      ప్రభుమణి బుక్కభూపాల చంద్రుడు
      యెక్కువగుణముల నియ్యారెవీటి
      బుక్కనరేంద్రుడు భువి బుట్టినంత
      వారిజాప్తోదయ వర్ణితవేళ
      దారలగతియయ్యె దక్కురాజులకు
      సరనాధమణి సాళ్వ నరసింగరాయ
      వరసఖుం డయిబుక్క వసుధేశు డమరె
      బుక్కభూపాలుండు బుధులకు నెల్ల
      దిక్కితండె యనంగ దేజంబు నందె."

అని యభివర్ణింప బడియుండెను. ఇతడు నరవాధమణి యైనసాళ్వనరశింగరాయ భూపాలునకు పరసఖుండుగా నుండెనని చెప్పుటవలన నితనికాలమున మనము సరిగాగుర్తించుటకు సాధ్యమగుచున్నది. సాళ్వనరశింహరాయలు క్రీ. శ. 1447 మొదలుకొని 1465 వఱకును కర్ణాట సామ్రాజ్యమును బరిపాలించిన మల్లికార్జునరాయలకును 1465 మొదలుకొని 1478 వఱకు బరిపాలనము చేసిన విరూపాక్షరాయలకును సమకాలికుడై వారలకు సామంతుడై యుండి కర్ణాటసామ్రాజ్యములోని చంద్రగిరి రాజ్యమును బరిపాలనము