పుట:Aliya Rama Rayalu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బాలభాగవతము తెలుగుభాషయందు వ్రాయబడినగ్రంథమగుటచేత విజయనగరసామ్రాజ్యచరిత్రమును రచించినవిదేశీయులైన గ్రంథకర్తలు కేవలము ఫెరిస్తా మొదలగుమహమ్మదీయచరిత్రకారుల వ్రాతల నాధారముచేసుకొని హిందూపక్షమును విస్మరించి వ్రాతవలసినవా రయిరి. కాని సోమదేవునిచే బలుమాఱులు కదనరంగమున నోడింపబడి తుదకు బరిభవింపబడినమహమ్మదుమలక బహమనీసుల్తానగు మహమ్మదుషాహ కాడని నాయభిప్రాయము.

రాఘవరాజు

సోమదేవరాజునకు గామలదేవియందు బుట్టినకుమారుడు రాఘవరాజని దెలియుచున్నది. వీనిగుఱించి ద్విపద బాలభాగవతమున నేమియు దెలుపబడి యుండలేదుగాని పద్యబాలభాగవతమున గురుశౌర్యధైర్యభాసురుడు రాఘవదేవవసుధేశు డనియు, సరసభూపాలీయమున 'ఘనభుజాశౌర్యరాఘవుడు రాఘవదేవధరణీశు' డనియు మాత్రము వక్కాణింప బడెను. నరపతివిజయమునందు

      "చ. పరబలవేది రాఘవనృపాలుడు పంకజనాభుంగూర్చియ
          ధ్వరములు నగ్రహారము లుదాత్తమతిన్ దగ జేసిధారుణీ
          సురుల కొసంగె బర్వముల శుద్ధసువర్ణగవాదిదానముల్
          గరిమను బిన్నశౌరినిజగద్విసుతున్‌ఘనుగాంచెవేడుకన్."