పుట:Aliya Rama Rayalu.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముట్టడించి స్వాధీనపఱచు కొనుటకు నసాధ్యమేమిగలదు? శత్రు పక్షము నవలంభించి తనయధికారమును పాలనమును దిరస్కరించిన, సాహసికులును, పౌరుషవంతులునైన, అడబాలనాయకుని, వీరినేడును రుద్రప్పనాయని, గౌరారెడ్డిని, గంగినాయకుని సింగంబు మత్తమతంగజములను బట్టుకొనుకైవడి సంగ్రామరంగంబున సంహరించి కిన్కచే నసహుండు నై రిపులెల్ల గగ్గోలుపడునట్లు చట్టలుచీరించి గంగినేనికొండ ప్రాగ్ద్వారసీమను గంబముల బాతించి తోరణగా గట్టించినా డని,

      "దండిమీరంగ నాతడు గంగినేని
       కొండలగ్గలచేత గొని యందుపరుల
       సుడియంగనీని గుజ్జులవీరినేని
       నడబాలయన్న రుద్రప్పనాయకుని
       ఘనుని గౌరారెడ్డి గంగినాయకుని
       గినిసినరిపులెల్ల గగ్గోలుపడగ
       చట్టలుచీరించి సంరంభ మెసగ
       గట్టించె దూరపుగవని కంబముల" అనియును,

       నరపతివిజయమునందును,

   "సీ. బలవంతుడగు నడబాలనాయకునిని
              శూరుడౌ గుజ్జుల వీరినేని
       రౌద్రరసోన్నిద్రు రుద్రపాధిపు మహా
              శౌర్యు గౌరారెడ్డి సాహసాంకు