పుట:Aliya Rama Rayalu.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లేనికతన మామిత్రులగు రంగస్వామిసరస్వతిగారు నరపతివిజయమునం దట్లుగానరాదనియు నియ్యది తరువాతి కాలమున కడపటిసామ్రాజ్య దర్బారులచే గల్పింప బడినదనియు నభిప్రాయపడిరి. కాని నరపతివిజయము కన్నను బూర్వము క్రీ. శ. 1469 సంవత్సరమున రచింపబడిన బాలభాగవతమునందు "ఒక్కనాడు లగ్గలుగొన్నవాడు" అని వ్రాయబడిన విషయము వారెఱింగి యుండరు. పైబిరుదు గద్యముగూడ రామరాజీయములోనిదని యెత్తి తమగ్రంథమున బ్రకటించియు దిన్నగ చూడకవ్రాసినది. బాలభాగవతమునందు:-

      "నరులకసాధ్యమైన మొసలిమడుగు
       ధరనెన్న దగినసాతానికోటయును
       కడునుతింపగ జాలు కందనవోలు
       కడిమి విశేషంబు గలకల్వకొలను
       అరుదైనరాచూరు నల యాతగిరియు
       నిరుపమంబగు గంగినేని కొండయును
       ననగ నొప్పారు నేడైన దుర్గముల
       వినుత ధాటీమహావేశంబు నెఱపి
       సురపతియోగి యాశుభ్రాంశవంశ
       కరు డొక్కనాడు లగ్గలు గొన్నవాడు"

ఒక్కనా డెట్లుసాధ్యమగునని రంగస్వామిసరస్వతిగారి తలంపు సోమదేవభూపాలుడు తనసైన్యములనేడు భాగములుగ విభజించి యాసైన్యములొక్కదినముననే యాయేడుదుర్గములను