పుట:Aliya Rama Rayalu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇతనిబిరుదగద్యములో "ఏకదివసఘటికైకధాటీహఠావృతకోట రాచూరుసాతానికోట కందనవోలు యాతగిరికలువకొల్లు మొసలిమడుగుగంగినేనికొండాభిధానసప్తదుర్గవర్తి" యనునద్భుతబిరు దమున్నట్టు గన్పట్టుచున్నది. [1]

ఒక్కదినములోపలనే కోటరాచూరు, సాతనికోట, కందనవోలు, యాతగిరి, కలువకొల్లు, మొసలిమడుగు, గంగినేనికొండ దుర్గముల నీతడు స్వాధీనపఱచుకొనియె నని పైబిరుదము దెలుపుచున్నది.

ఈయేడుదుర్గములను 'వరుసతోసాధించి' యని నరపతివిజయమునందుండి ఒక్కనాడే లగ్గల గొన్న ప్రస్తావము

  1. బిరుదుగద్యము:- "జయజయ, నిఖిల మహాభాగవతముఖ్యవిఖ్యాతకీర్తి, ఏకదివసఘటికైకధాటీహఠావృతకోట రాచూరుసాతనికోట కందనవోలుయాతగిరికలువకొల్లు మొసలిమడుగు గంగినేనికొండాభిధాన సప్తదుర్గవర్తి, స్థలదుర్గగిరి దుర్గజల దుర్గవసదుర్గచౌరాశి దుర్గవిఫాల, సముద్ఘుష్య మానబిరుదాపదాన హళహళికాకర్ణన పులకితకపోల, నాకులపాటి ముదుగంట్యానెగొంది కుంతి సరవిజయలక్ష్మీసమక్షీకరణలక్షిత, ఆకులపాటి వీరక్షేత్రభారతీమల్ల, ముదుగంటివీరక్షేత్రభారతీమల్ల, ఆనెగొంది వీరక్షేత్రభారతీమల్ల, కుంతివీరక్షేత్రభారతీమల్ల, వీరక్షేత్రభారతీ మల్లబిరుద భరితానుభావ, స్వభావగాంభీరాంబోనిధి, సత్వగుణవానుదేవ, సకల నరదేవా చూడామణి, అసిభరణపటిమసహదేవ, ఆదిదేవ, సుపర్వమణీమణిస్తుత, వరద, భయద, హొసబిరుదరగండ, విరప్రతాపబిరుద, బిరుదుమన్నెరగండ, పురిగొలసురత్రాణ, శరణాగతత్రాణబిరుద, రాయరణరంగభీభత్స, రాయరాహుత్తరగండ, యైవరగండ, గండరగండ, తాతపిన్నమరాజతనూజ, సోమదేవరాజ, విజయీభవ, దిగ్విజయీభవ."