పుట:Aliya Rama Rayalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామిసరస్వతిగారు వ్రాయుచున్నారు.[1] మహమ్మదుమలకబహమనీసుల్తా నగుమొదటి మహమ్మదుషాహ యని సంశయ మావంతయు లేక యూహించి నపుడింతకన్న నెక్కువయూహ కవకాశమిచ్చు టసంభవము.

ద్విపద బాలభాగవతమున గాని, నరపతివిజయమున గాని వర్ణింపబడిన సోమదేవుని వీరకృత్యములుగాని, బిరుదు గద్యములుగాని తదితరచర్యలుగాని వీరియూహలను బలపఱచునవి గావు. ఏమన సోమదేవునివీరకృత్యము లన్నియు బహమనీరాజ్యము దక్కనులో స్థాపింపబడుటకు బూర్వమె జరిగిన వనియాగ్రంథములలోని వర్ణన లవకాశ మిచ్చుచున్నవి గాని యటుపిమ్మట జరిగినవిగా నవకాశ మిచ్చుచుండలేదు

      "నయవిశారదుడు పిన్నయసోమ విభుడు
       జయశాలి భూపాల సార్వభౌముండు."

అని కోనేరునాధకవి ద్విపదబాలభాగవతమున జెప్పియుండినవిషయము కవివర్ణ నాంశ మైనయతిశయోక్తిగ భావింపరాదు. అట్లుభావించుట సత్యచరిత్రమునకు వెల్తి కల్పించినవార మగుదుము. ఇక్కాలమున మనము సోమదేవుడుసార్వభౌము డయినది లేనిదియు గుర్తింప జాలనంతటి దౌర్భాగ్యస్థితియందున్నను, ఇంచుక జాగరూకతతో నాకాలరాజకీయపరిస్థితులను బరిశీలించితి మేని సత్యము గోచరింపక మా

  1. Sources of Vizianagar History Introduction p. 7 no. 28 p. 80.