పుట:Aliya Rama Rayalu.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాలము విద్వద్గోష్ఠి యందుండెనని ప్రపన్నామృత మనుగ్రంథమునుబట్టి దెలియుచున్నది. ఈశ్రీనివాసతాతాచార్యుడు శ్రీరామానుజులవారి మేనమామ యగు శ్రీశైలపూర్ణునివంశములోనివాడు. మొదటస్మార్తమతము నందున్నబ్రాహ్మణ కుటుంబమె రామానుజునికాలముననే వైష్ణవములోనికి మాఱినది. వాధూలగోత్రోద్భవు డయినదొడ్డ యాచార్యుడు వాదమునశైవాచార్యుల గెలిచినందున నతడు చిదంబరదేవాలయములో క్రిమికంఠ చోళునికాలము నాటినుండియు బూజాపునస్కారములులేక మూలపడియున్న గోవిందరాజస్వామివారి విగ్రహమును మరల నాదేవాలయములో బ్రతిష్ఠాపించి పూజాసంస్కారములు జరుగునట్లు చేయవలసినదని రామరాయలనుకోరగా నతడాఘనకార్యమును నిర్వహించెనని పైగ్రంథము దెలుపుచున్నది. ఈదొడ్డయాచార్యులు చండమారుతమను గ్రంథమును తాతాచార్యులు పంచమత భంజనమును వ్రాసెను.

ఇయ్యవి యప్పయదీక్షితులవారు వ్రాసినయద్వైత దీపికపై ఖండనగ్రంథములు. రామరాయ లితరమతశాఖలను ద్వేషింపకపోయినను స్వమతాభిమానమును విశేషముగా జూపించెను. ఇతడేగాదు వీనిపూర్వులును వైష్ణవమతవ్యాప్తికి బాటుపడిరి. ఈవిజయనగర సామ్రాజ్యపాలకులకాలముననే, దక్షిణదేశమున వైష్ణవమతము విస్తరింప బడినది. తాతాచార్యులవారి ముద్రయని లోకులచే బ్రశంసింపబడు తాతాచార్యులవారు వీరిగురువుతాతాచార్యులవారే. చక్ర