పుట:Aliya Rama Rayalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్వశాసనమును శిరసావహించి మంగలకులమువారెల్లరు నెట్టిపన్నును చెల్లింపవలసినపనిలేదని శాసనములం బ్రకటించిన ట్లనేకశాసనములవలన దెలియగలదు. ఇట్టిమహోపకార మీకులమువారికి విజయనగరసామ్రాజ్యమున మరేపూర్వప్రభువుకాలమునను జరిగియుండలే దనుట సత్యము.

స్వమతాభిమానము

ఆరవీటివంశమువారు మొదలనుండియు వైష్ణవమతస్థులై యుండుటచే నళియరామరాయలును వైష్ణవ మతమునందే నిలిచి యుండెను. విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన సంగమవంశము వారుమాత్రము శైవులుగ నుండురికాని తక్కినవంశములవా రెల్లరును వైష్ణవమతమువారై యున్నారు. ఈసామ్రాజ్యాధిపతులలో మొదటివంశములోనివా డయిన విరూపాక్షరాయలుదక్క తదితరప్రభువు లెవ్వరునుమతములను మార్చుకొనలేదు. మొదటివంశమువారైన శైవప్రభువులును తరువాతి వంశములవారయిన వైష్ణవప్రభువులును మతపరిపాలనాసందర్భమున శైవవైష్ణవమతభేదము లెంచకుండ దేవస్థానములను మతములను నిష్పక్షపాతబుద్దితోనే పోషింపుచు వచ్చిరని నిస్సంశయముగ నుడువవచ్చును. రామరాయలగురువు శ్రీనివాసాచార్యులపుత్రు డగుతాతాచార్యులు. రామరాయలును గురువుతాతాచార్యులును చంద్రగిరిదుర్గమున గొంత