పుట:Aliya Rama Rayalu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కెల్లరకు మహోపకారముచేయ గలిగెను. అళియరామరాయలు 1545 సంవత్సరము కొండోజు పనివానితనమును మెచ్చుకొని మంగలివారు చెల్లింపవలసిన కులపన్ను, వృత్తిపన్ను, యితరములయిన పన్నులనేమియు నాతడు చెల్లింప నవసరములేదని యుత్తరువు చేసెను. 1554 సంవత్సరములో రామరాయలకు గొప్పసేవచేసి ప్రభువునకు విజ్ఞప్తిపంపుకొన నాతడు దయతో విశ్వసించి మంగలివాండ్రపై గలసుంకమును దీసివేయవలసిన దనిశాసనమును బ్రకటించెను. ఆతడును, అతనికుటుంబమువారును 1556 వ సంవత్సరమునుండి సామ్రాజ్యము నాలుగుసరిహద్దులలోపల నిర్బంధసేవనుండియు విరద, స్థిరముగా బన్నులను జెల్లింపవలసిన నిర్బంధములనుండియు దొలగింప బడియెను. అళియరామరాయల దయకు బాత్రు డయినదీకొండోజు మాత్రమెగాదు. అళియ రామరాయలు 'తిమ్మోజు, హొమ్మోజు, భర్రోజు' ననుమూవురు మంగలుల పనితనమునుగూడ మెచ్చుకొని పన్నులనిర్బందము నుండి వారినివిముక్తులను గావించి నట్లుగా హిరెకెరూరు శాసనమువలన దెలియుచున్నది. చక్రవర్తికిని, మంత్రికి నిట్టి మంగలనాయకులతోడి పొత్తువలన సామ్రాజ్యములోని మంగలవాండ్ర కెల్లరకు మహోపకారము కలిగినది.

ఎప్పుడు సామ్రాజ్యప్రభుత్వమువారియుత్తరువు రామరాయలసంతకముతో బయలువెడలినదో అప్పటినుండి సామ్రాజ్యోద్యోగస్థులును, తదితరసామంతమండలాధిపతులును ప్రభు