పుట:Aliya Rama Rayalu.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నరువదిరేవు పట్టణములు సంరంక్షింపబడుచు విదేశములతో వ్యాపారములు జరుపుచుండుటచేత కులవృత్తు లభివృద్ధిలో నున్నవని వేఱుగ జెప్పవలయునా ? అన్నివృత్తులమాట యటుండనిచ్చి యొకమంగలివృత్తిమాట విచారించిన దక్కినవృత్తులయందు గూడ నెట్టియభిమానము గలిగియుందురో చదువరులు చక్కగా గ్రహింప గలరు. అళియరామరాయలు మంగలివృత్తిని నీచవృత్తిగను, మంగలి వృత్తిగలవారిని నీచులనుగను జూచినట్లు గనుపట్టదు. అంతియగాక వారిని దుర్భరదారిద్ర్యమునుండి తప్పింప బూనినట్లుకూడ గానబడును. అళియరామరాయలకాలమున నీవృత్తియందు నేర్పరులయిన పనివాండ్రు పెక్కండ్రు కలరు. వారిలో బాదామికాపురస్థుడగు మంగలతిమ్మోజుకొండోజుగారు చాలప్రఖ్యాతుడై యుండెను. ఇతడు గడ్డముగీయునపుడు తననేర్పరితనము నంతయు జూపించు నట ! ఇతడు రామరాయల సొంతమంగలి యని చెప్పవలసి యున్నది.

ఏవృత్తియైనను శ్రద్ధతో నభ్యసించిన నావృత్తియందే గొప్పఖ్యాతిని సంపాదింపవచ్చుననుటకు మంగలికొండోజుగారిని నిదర్శనముగా జూపవచ్చును. యళియరామరాయ లీవృత్తినేర్పరితనమును మెచ్చుకొని చక్రవర్తితో గూడ నీతనిగుఱించి ప్రశంసింపుచు వచ్చెనట. అందువలన రామరాయలకు మాత్రమెగాక చక్రవర్తిదయకు గూడపాత్రుడయ్యెను. ఇట్టిదయను సంపాదించుటవలననే యితడు తనకులమువారి