పుట:Aliya Rama Rayalu.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పాతించెను. అదేవిధముగా బుక్కరాయపురము బ్రాహ్మణపల్లె గ్రామములవివాద తటస్థించినపుడు సరిగా కొలతలుకొలువబడి స్పష్టముగా దెలియునటులు సరిహద్దుగుర్తు లేర్పఱచబడినవి.

వ్యవసాయాభివృద్ధి

వ్యవసాయాభివృద్ధినిగుఱించి యెట్టిశ్రద్ధ వహించినది మనకు దెలిసికొనుట కంతగా సాధ్యముగాక పోయినను కొన్ని దృష్టాంతములనుబట్టి కొంతవఱకు గ్రహింపవచ్చును. పొత్తపియనుగ్రామమున వ్యవసాయముకొఱకు వరదరాజు, ఎల్లమరాజు ననువారు 60 కుంటలభూమి నిచ్చి యొకకాలువను ద్రవ్వించిరి. అదేగ్రామమున మట్లవరదరాజనునాత డంతరంగకాలువ యనుపేరితో మఱియొకకాలువను ద్రవ్వించెను. మొలకలమూఱుసీమలో చవిటిమన్ను తొలగించుటకై యుప్పరవాంద్లకు సదాశివదేవ రాయలు పన్ను చెల్లింపకుండుపద్ధతిని కొంతభూమి నిచ్చినట్లు గనుబట్టుచున్నది. అనేకవిషయములను బట్టి వ్యవసాయాభివృద్ధి సంరక్షింపబడుచున్నదనియె తలంపవచ్చును.

కుల వృత్తులు

ఈకాలమున విజయనగరసామ్రాజ్యమునందు కులవృత్తులు చక్కగా బోషింపబడుచువచ్చిన వనేకదృష్టాంతములను జూపవచ్చును. విజయనగరసామ్రాజ్యమునం దీకాలమున