పుట:Aliya Rama Rayalu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రముల కనంతరము రెండుగ్రామములను బ్రాహ్మణుల కనేకులకు దానముచేసెను. 1548 లో కనుమయను గ్రామమును బ్రాహ్మణవిద్వాంసులకు దానముచేసెను. వేదాంగపారగులైన పెక్కండ్రు బ్రాహ్మణులకు బెవినిహల్లిగ్రామమును దానముచేసెను. 1544 మొదలుకొని 1546 వఱకు వరుసగా మూడు గ్రామములను ఒంగోలు పురవాస్తవ్యు డయినతాళ్లపాకతిరుమలయ్యగారికుమారుడు చిన్నకోనేటి తిరువేంగళనాథయ్యగారికి నగ్రహారములుగా నొసగబడెను. వీరు వేదవేదాంతమార్గ ప్రతిష్ఠాపనాచార్యు లయినవారు. మఱియు బ్రాహ్మణులకు జేయబడిన భూదానశాసనములుగూడ వందలకొలది గలవు.

సరిహద్దులతగవుల పరిష్కారము

వీరిపరిపాలనమున సరిహద్దులనుగూర్చిన వివాదములు పుట్టుచు వచ్చెను. అట్టితగవుల నన్నిటిని సామ్రాజ్యకార్యకర్తలవలన పరిష్కారము లగుచు వచ్చిన వని కొన్నిశాసనములనుబట్టి తెలిసికొన నగును. అనంతపురమండలములో రెండు గ్రామములవారికి నీటిహక్కులనుగూర్చి 1553 లో వివాదము తటస్థించినప్పుడు రామరాజుకోనప్పదేవమహారాజు గారివలన బరిష్కారము గావింపబడినది. అదేమండలములో బెదమల్లెపల్లెయను గ్రామమున సరిహద్దులనుగూర్చి వివాదములు పొసగినపుడు దానప్పనాయ డనునాతడు తానుస్వయముగా బరిశోధించి వారివివాదములను బరిష్కరించి సరిహద్దులలో ఱాళ్లు