పుట:Aliya Rama Rayalu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


      విడువు మన్నను గాచి విడిచి యర్ధులకును
               షష్టిశతంబుల నశ్వముల వాని

  తే. చేత నిప్పించి శరణన్న బ్రీతి గాచు
     బిరుదుతగునీతనికె యని ధరణిపతులు
     సన్నుతింపగ నాదిరాజన్య చర్య
     దేజరిలె సోమదేవ ధాత్రివరుడు."

అని వర్ణింపబడుటవలన నీసోమదేవరాజు తనకుశత్రువును మహాపరాక్రమవంతుడు నగుమహమ్మదుమలకను పలుమాఱు యుద్ధములలో జయించుటయెగాక యొకప్పుడు వానిని పట్టుకొని బంధించి నప్పుడాతడు 'రాజన్యా! నీపాదములను బట్టుకొని నమస్కరించుచున్నాను; నాకుమారునకు నీపేరుపెట్టెదను; నన్నుగాచి రక్షించు' మనివేడుకొనగా దయతో వానిని విడిచిపెట్టి వానిచేత నర్ధులకు నాఱువేల యశ్వముల దానమిప్పించెనని దెలియుచున్నది! ఇందుపేర్కొన బడిన మహమ్మదుమలక క్రీ. శ. 1358 మొదలు 1375 వఱకు బదునేడుసంవత్సరములుకలుబరగి పట్టణము రాజధానిగాబరిపాలనము చేసినబహమనీసుల్తా నగుమొదటి మహమ్మదుషాహ యని రంగస్వామి సరస్వతిగారు గుర్తింపగా డాక్టరుకృష్ణస్వామి అయ్యంగా రామోదించినారు. ఇంతటితోవిరమించిన జక్కగానుండెడిది. అట్లుగాక సోమదేవరాజు విజయనగరచక్రవర్తులలో మొదటివారఅయిన హరిహర, బుక్క, రెండవ హరిహరుల సేనానులలో నొక్క డయియుండవలయు ననిగూడ రంగ