పుట:Aliya Rama Rayalu.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విప్రవినోదివీరముష్టివీరప్పయనునాతడు గ్రామమునుండి తనకువచ్చు నాదాయమునంతయు విశ్వేశ్వరదేవునికి సమర్పించెను. అగ్రహారము బ్రాహ్మణులనుండి తనకువచ్చెడు నాదాయమునంతయు విప్రవినోదసిద్ధయ చెన్నకేశవస్వామివారి మహోత్సవమునకై సమర్పించెను. కంబదూరుమల్లికార్జున దేవరకు విరూపాణ్ణనాయకుడు 50 వరహాల నొసంగెను. విప్రవినోదిబ్రాహ్మణులు తాము బ్రాహ్మణులనుండి సంపాదించినసొమ్మును దేవుళ్లకు సమర్పించెడివారు పెక్కండ్రు కలరు. గారిడివాండ్రు వేలమూరినుండివచ్చెడు నాదాయమునంతయు చెన్నకేశవస్వామివారి కైంకర్యములకు వినియోగించు చుండిరి. మహామండలేశ్వర చినతిమ్మరాజకొండయదేవ మహారాజు జిల్లేళ్ల గ్రామములో దానువసూలు చేసెడు కొన్నిసుంకముల నాయూరిలో వీరభద్రదేవునకు సమర్పింపు చుండెను. ఇట్టివే పెక్కులు దానశాసనములు గనుపట్టుచున్నవి.

బ్రాహ్మణవిద్వాంసుల పోషకత్వము

ఇట్లు రామరాయల ప్రభుత్వకాలమున దేవాలయధర్మాలయపోషకత్వమెగాక విద్వాంసులయిన బ్రాహ్మణులపోషకత్వముగూడ జక్కగా నిర్వహింప బడుచు వచ్చినవి. 1545 సంవత్సరములో సదాశివదేవరాయలు కొందరుబ్రాహ్మణులకు దానములను బెక్కులు చేసెను. గోవిందవామపురమను గ్రామము నొకబ్రాహ్మణున కొసంగెను. రెండుసంవత్స