పుట:Aliya Rama Rayalu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్నయాలయమును బాగుచేయించెను. దేశాంతరినరసింగదాసు తిరువళిక్కేణిలోని పార్థసారధిదేవాలయము ననేకవిధములుగా నభివృద్ధిపఱచెను. తిరుమలరాయనిదళవాయి యగు జంగమయ్య యొకనూతనదేవాలయమును నిర్మించెను. గుత్తి తిరుమలరాజయ్యగారు మన్నూరు గ్రామములోని చెన్నకేశవస్వామివారి దేవాలయములో మంటపనిర్మాణము గావించెను. తిమ్మరంగరాజను వారు విజయనగరములోని మహాదేవాలయములో 25 భాగములుతో నొప్పునొకధర్మశాలాభవనమును నిర్మించి దానికిరంగమంటపమనిపేరిడెను. చిన్నఔబలరాజనునాయని ఆరకటవేముల యగ్రహారములో నొకదేవళమును గట్టించి యందుగోపాలకృష్ణదేవుని విగ్రహమును ప్రతిష్ఠాపించి గండికోటదుర్గసీమలోవచ్చు నాదాయమునుండి సాలునకు 31 1/2 వరహాలు సమర్పించుటకు నేర్పాటుచేయుటయేగాక యాయగ్రహారములోనిశివార్లనుగూడ నాదేవుని కర్పించెను. ఔబలరాజయ్యదేవమహారాజు కడప, వెలదుర్తి గ్రామములలో లోహవిగ్రహములను బ్రతిష్ఠాపించి చెన్నకేశవపెరుమాళ్ల భోగకైంకర్యములకై పండ్రెండువరహాలు సమర్పించుటకై యనుజ్ఞచేసెను. ఆత్రేయగోత్రజుడును చంద్రవంశ్యుడునునైన రాచిరాజదేవమహారాజు దేవాలయమును నిర్మించియందు మదనగోపాల విగ్రహమును బ్రతిష్ఠాపించి భూదానములు మొదలగువాని బెక్కింటిని గావించెను. పెమ్మసాని చినతిమానాయ డనునొకసామంత మండలేశ్వరుడు తాడిపర్తిలోనితిరు