పుట:Aliya Rama Rayalu.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యప్రజలు తమజాతీయమతము నందభిమానము వీడకుండునట్లు ప్రోత్సాహపరచుచుండునటుల వారికాలమునాటి దానధర్మములను లిఖింపజేసినవారి శిలాశాసనములే వారి తామ్రశాసనములే వేనోళ్ల వక్కాణించుచున్నవి. సదాశివదేవరాయని పేరిటి దానశాసనములు పెక్కులు కనంబడుచున్నను నవియన్నియు రామరాయలు ప్రోత్సహించిన వనియే మనము విశ్వసింపవచ్చును.

దేవాలయ పోషకత్వము

నల్లచెర్వుపల్లెలోని పురాతనభైరవేశ్వరాలయము సదాశివదేవరాయనిచే విశాలపఱుపబడుటయెగాక సొగసుగా నలంకరింపబడినది. గోపాలకృష్ణదేవునియాలయమునుండి యెట్టి సుంకమును గైకొనకుండ జేసెను. తానుపట్టాభిషిక్తుడయినప్పుడు మార్కాపురములోనిదేవునకు నొకగ్రామమును దానముచేసెను. సచ్చిదానంద స్వామివారికి పుదూరుగ్రామము నిచ్చెను. పొత్తపినాడులో పులుపటగ్రామముతో సహామూడుగ్రామములను, ఒంటిమిట్టలో గొంతభూమిని ఒంటిమిట్టగ్రామములోని కోదండరామస్వామి వారికి దానముచేసెను. కృష్ణాపురములోని విష్ణ్వాలయమునకు ననేకగ్రామము లొసంగబడియెను. హిందూపురముతాలూకాలోని తిమ్మసముద్రమనుపేరుతో కాగల్లుగ్రామము మల్లికార్జునస్వామివారి కర్పింపబడియెను. జమ్ములమడుగు తాలూకాలోని కోసానెపల్లె