పుట:Aliya Rama Rayalu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగలరాసులను, ధనరాసులను, ముత్యముల రాసులనుపోయించి జయము పొందుచుండిన సైనికులకు బహుమానములుగ నొసంగుచుండె నట. రాయలయౌదార్యమునకు సైనికులత్యంత సంతోషమునుజెంది ఫిరంగివ్రేటులవలన గలిగినకలవరమునుండి శాంతినిబొందినవారై శత్రువుల కుడియెడమ ప్రక్కలనుండు సైన్యములనుదాకి భీభత్సముసేయ ఆదిల్‌షాయు, కుతుబ్షాయు నింకజయము కలుగుట దుస్సాధ్యమని తలంచిరని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. తమకింక నపజయము తప్పదని తలచిరని ఆలీ - ఇబూ - అజీజు వ్రాయుచున్నాడు. తురకలసైన్యములో బార్శములనున్న రెండుభాగములును బూర్తిగా నోడింపబడినవని హిందువులువ్రాసిన చరిత్రము వలన దేటపడుచున్నది. ఫరియా - డి - సౌజా యను నాతడు గూడ రామరాయలు శత్రువుల దాదాపుగా నోడించెనని వ్రాయుచున్నాడు. వేసవి కాలమున జెట్లయాకులు రాలి కుప్పతిప్ప లయినట్లుగా తురకసైనికులశవములు కుప్పలుకుప్పలుగ గూలిపోయి రాసులగుచుండెననియు, పాషండులు (హిందువులు) తమయాధిక్యతయు బరాక్రమంబును నెఱపిరని 'మీర్జాఇబ్రహీమ్‌జబిరీ' యనునాతడు 'బసాతిన్ - ఉస్ - సలాతిన్‌' అనుగ్రంథమున వ్రాసియున్నాడు. [1]

అయినను హుస్సేనునిజాముషా సుస్థిరముగా మధ్యభాగమున నిలిచియుండెనని ఫెరిస్తా వ్రాయు చున్నాడు. ఫిరం

  1. The Aravidu Dynasty of Vijianagar p. 210