పుట:Aliya Rama Rayalu.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విడుటకు సంసిద్ధుడైయుండ హుస్సేనునిజాముషా మరల తనసైన్యములను బురికొల్పుకొనివచ్చి హిందూసైన్యముల మఱియొకమా రెదుర్కొన బోరుఘోర మయ్యెనట ! రుమీఖాను నాధిపత్యము క్రిందనున్న డిరంగులవారు తాముగానుపింపకుండ 'ఇఖాసుఖాను ఖురాసాను' సైన్యముల వెనుకనుండి శతఘ్నులవర్షము గురిపింపగా రాయలసైన్యములు తఱుముకొనివచ్చి పైబడగా ఖురాసానుసైన్యములు వెనుకకు బాఱి హిందూసైన్యములు ఫిరంగులసమీపమునకు వచ్చినతోడనే యాకస్మికముగా ఫిరంగిగుండ్లను ప్రేల్చ బ్రారంభించిరట ! అపుడురాయలసైన్యములు విశేషనష్టముతో వెనుదీయ వలసివచ్చెను. ఈసందర్భమున ఇఖ్లాన్‌కాను, రుమీఖానులధైర్య సాహసములను మెచ్చుకొనదగినదని ఆలీ - ఇబూ - అజీజు వ్రాయుచున్నాడు. ఈసమయమున హుస్సేనునిజాముషా తన గుడారమును శత్రువులకెదురుగ నెలకొల్పి జయముకలుగువఱకు బోరాడ నిశ్చయించుకొనియె నట. ఇంతియగాక హుస్సేనునిజాముషా తనభార్యలను, ఉంపుడుకత్తెలను తనస్కంధావారమునకు రప్పించి తనకపజయముకలిగి మరణము సంభవించినపక్షమున వారలనుసంహరింప వలసినదిగా ఖొజ్జాలకు నుత్తరువుచేసి వారలకు గాపు పెట్టెనట.

రామరాయలు తనకియ్యది యవమానకరమని భావించి తానుగుఱ్ఱమునుండిదిగి యచట నొకరత్న కంబళమును బఱపించి రత్నసింహాసనమునుబెట్టి దానిపైనధిష్టించి తనయెదుట