పుట:Aliya Rama Rayalu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీష్మాచార్యునివలె నీవృద్ధవీరు డిట్టిపౌరుషవచనంబు లాడుచుండినపుడు వీరు డైనయువకయోధు డెవ్వడు వెనుదీయుటకు సాహసించును ?

ఈవృద్ధవీరుడు యుద్ధరంగమున బల్లకినెక్కియుండుట కంటె హయారూడుడై యుండుట సురక్షితమని వీరవర్గమును తనసేనానులు నెంతప్రార్థించినను వినక 'బిడ్డలతో బోరాడునపుడు సురక్షితస్థానములకై వెదకికొన నక్కరలేదనియు, ఇదియు నొకయుద్ధమేనా యనియు, మొదటిదెబ్బతోనే యీగలవలె జెల్లాచెదరై యెగిరిపోవుదు రనియు బలికె' నని ఫెరిస్తా వ్రాయుచున్నాడు.

రామరాయలును వానిసోదరులును తురుష్కసైన్యములను జూచి భయపడిపోయి యాదినమున వారితో బోరాడుట కిష్టపడక మరలిరనియు, అదిసందుచేసికొని హుస్సేనునిజాముషాయును తక్కినవారును యుద్ధమునకు డీకొనక తామును తమసైన్యములును కొంతవిశ్రాంతిని తీసికొన నిశ్చయించి మఱునాటియుద్ధమున కెదురుచూచుచు నారాత్రి సుఖముగా విశ్రమించిరని 'అలీ - ఇబు - అజీజు' వ్రాసియున్నాడుగాని యిదియంతగా విశ్వాసపాత్రముకాదు. మఱునాడు మధ్యాహ్నముపండ్రెండు గంటలకు యుద్ధముప్రారంభింపబడినది. వేంకటాద్రి యధ్యక్షతక్రింద నడుపబడుచున్న యెడమ పార్శ్వమునున్న హిందూసైన్యములు తొలుదొల్త విజాపురసుల్తానుసైన్యముల నెదుర్కొనియెను. వేంక