పుట:Aliya Rama Rayalu.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యుండుటచేత శత్రుసైన్యము నదిని దాటుటకై తగినరేవునకై పరిశోధింప వలసివచ్చెనుగాని హిందూసైన్యముల కెదురుగనున్నదియె ముఖ్యమైన రేవుగనుండుటచేత వారినాయకులెల్లరు నొకచోట సమావేశమై యాలోచించి యానదిని దాటుటకై యొకయుక్తిని బన్నిరట ! మఱియొకరేవున దాటుటకై తాము ప్రయత్నించుచున్నట్లుగా శత్రువులకు గన్పట్టుటకై తమసైన్యములతో నదిపొడుగున బ్రయాణము సల్పుటకును, హిందూసైన్యములు తమస్థానములను విడిచి తమ్మెదుర్కొనుటకు వచ్చునపుడు తమవెనుకవచ్చెడుసైన్యము వెంటనే వెనుదిరిగివచ్చి యాముఖ్యమయినరేవుననే నదినిదాటుటకు నిశ్చయించుకొని మరునాడుదయమున తమసైన్యములతో బయలుదేఱి మూడుదినములు ప్రయాణముసాగించి రట ! ఈమోసమునకు లోనయి హిందూసైన్యములు వారికెదురుగ దక్షిణపుటొడ్డున బ్రయాణము సాగించినవట. మూడవనాటిరాత్రి హిందూసైన్యములు తమస్థానము విడిచిపోవుటను గాంచి హుస్సేనునిజాముషా సైన్యములు గిఱ్ఱున వెనుకకు మరలి తమ్మెదురించు హిందూసైన్యములు గానరానందున నత్యంతవేగముతో నదినిదాటి మఱునాటియుదయమున సుస్థిరముగా నిలిచిపోయిరట ! ఇట్లని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. ఎట్లయిననేమి ? సుల్తానులసైన్యములు కృష్ణనుదాటి దిగువనకు వచ్చినవి.