పుట:Aliya Rama Rayalu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుండుటకై యామెవెంటనే పెక్కునగలను తలచుట్టు దిగదుడుపు తుడిచెనట ! అప్పుడు రామరాయ లామెకు సామ్రాజ్యవ్యవహారములను విశదపఱచి యెట్లు దక్కనుసుల్తానులునల్వురు నేకమై తన్ను నెదుర్కొన నున్నారో, ఎట్లుదేవళములు, ధర్మశాలలు, బ్రాహ్మణులు వారిపాలబడి కడగండ్లబడ సిద్ధముగ నుండెనో యావిధమునంతయు బూసగ్రుచ్చునటుల నివేదించి వారినిశిక్షించి వారిప్రయత్నములను భగ్నపఱచుటకు దా నవలంబించినమార్గమును వినిపించి యుద్ధమున కనుజ్ఞ నీయవలసినదని యామెకాళ్లపై బడి ప్రార్థించెనట ! అందునకామె యియ్యకొనక 'మనమువారికి హానికలిగింపలేదు; అయినను వారెల్ల నేకీభవించి మనపైదండెత్తి వచ్చుచున్నారు; వారితో సంధిచేసికొనుట తగు' నని పలికెనట ! ఆమెచెప్పిన దాతనికిష్టములేక వెడలిపోయెనట ! అందుమీద నామె తనకుమారునిసంతోష పెట్టుటకై ప్రయత్నించె నట ! ఆరాత్రి రాయలుతనగదిలో విశ్రాంతిగైకొనియె నట ! అతడారాత్రి తనచెవికుండలము లెవరో చూఱగొని తన్ను సింహాసనమునుండి పడద్రోచినట్లుగా స్వప్నము గాంచె నట ! అప్పుడాతడు దైవజ్ఞశిఖామణులను రప్పించి వారలకు దనస్వప్న వృత్తాంతమును విన్పింపగా వారలుభయములేదనియు శత్రువులను జయించి బహుకాలము రాజ్యపరిపాలనము చేయగలవని యాతనినోదార్చి మనశ్శాంతి గలిగించిరట. పిమ్మట వారలకు నూతనవస్త్రములను గట్ట