పుట:Aliya Rama Rayalu.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దములు కలుగుచునే యుండెను. అళియరామరాయలపై హుస్సేనునిజాముషాకు గలద్వేష మత్యంతరోషా నలపూరితమైయుండెను. 'ఎప్పుడు రామరాయలనుజంపి వానిసామ్రాజ్యమును భగ్నముచేయ గలుగుదునా' యని త్రాచుబామువలె బగబట్టి బుస్సలుకొట్టుచున్నవా డగుటవలన నీమహాకార్యమును నిర్వహించుటకై శక్తివంచనలేకుండ దొలుదొల్త బ్రయత్నించిన వా డితండనుటకు లేశమాత్రము సందియము లేదు. ఆలీఆదిల్‌షా మొట్టమొదట నీమార్గమాలోచించినవాడని ఫెరిస్తావ్రాసినది విశ్వాసపాత్రము కాదు. ఆలీఆదిల్‌షాకును, ఇబ్రహీమ్‌కుతుబ్షాకును ప్రాణరక్షణము నొసంగి వారిరాజ్యములపై నిలువబెట్టినవాడు రామరాయలని వారెఱింగి యుండకపోలేదు. కాని హుస్సేనునిజాముషాతో జేసినయొడంబడికల మూలమునను సంబంధబాంధవ్యముల మూలమునను వీరు వానితో గలియవలసిన వారయిరి గాని వాస్తవముచేత రామరాయలను వానిసామ్రాజ్యమును నాశనము గావింపవలయునంతద్వేషము వారికున్నట్లు గానరాదు. మఱియును గొందఱుచరిత్రకారులు వ్రాసినట్టు లీయుద్ధము కేవలము మతావేశపరవశత్వమువలన గలిగినదని చెప్పుటకును సాధ్యపడదు. ఆనెగొందిపురములో హిందువులకు బవిత్రమైనయొకకోనేటిలో తురకఫకీరును వానియనుచరులిర్వురును స్నానముచేయగా వారిని జావగొట్టి పంపుటయె కారణమని వ్రాయుటకూడ నంతవిశ్వాసపాత్ర మైనదిగా గను