పుట:Aliya Rama Rayalu.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరదేశమున దక్కనుసుల్తానులతో బోరాడుచు రామరాయాదు లెట్లుజయమును బొంది సామ్రాజ్యములోని యుత్తరభాగమున నెట్లుశాంతి నెలకొల్పి పాటుపడిరో యట్లే విఠలరాయలు, చినతిమ్మరాజు మొదలగువారు దక్షిణదేశములోని యల్లరులను మాన్పి శాంతి నెలకొల్పిరి. విఠలరాయలు వృద్ధు డగుటవలన దరువాత మృతినొంది యుండును. ఇతడు పరవజాతివారితోను, వారికి సాహాయ్యము జేసిన పోర్చుగీసుఫాదిరులతోను జేసినయుద్ధములు బహుస్వల్పమయినవిగను, ప్రాముఖ్యతగాంచనివిగ నున్నవిగావున వానివివరణ మిటనుదాహరింప బూనకొనలేదు. తుదకు పరవజాతివారు కప్పము చెల్లించుట కొప్పుకొని మధురాపురాధీశుడైన విశ్వనాథనాయకునితో నొడంబడిక జేసికొనిరి.


ఆఱవ ప్రకరణము

రక్షస్థ్సగిడి యుద్ధము

అళియరామరాయ లింతవరకు దక్కనుసుల్తానులతో నడపినయుద్ధములలో నెపుడును నపజయమును బొందియుండ లేదు. తానుసామ్రాజ్యభారము వహించిన యిరువదిసంవత్సర