పుట:Aliya Rama Rayalu.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లను బెక్కండ్రను పురములోనికి బోయివారివారియిండ్లుపరిశోధించి ద్రవ్యమునంతయు గొనిరావలసిన దనియుత్తరువుచేసె నట ! ఆతనియాజ్ఞను శిరస్సునబెట్టుకొని వారెల్లరును వారి కొయ్యకంపలనుగూడ విడువక కొంతద్రవ్యమును గూడ గొనివచ్చిరట. వారుగొనివచ్చిన దంతయు నూఱువేలవరహాలమొత్త మయినలేదని 'కోటో' తెలుపుచున్నాడు. దానిని జూచి రామరాయలు తానుమోసపుచ్చ బడితి ననిభావించి యాగ్రహమహోదగ్రుడై తనకు సలహాచెప్పినపోర్చుగీసువాని శిక్షించుటకు నిశ్చయించుకొనె నట ! అదివఱకే యాతడు సైన్యమునుండి తప్పించుకొని పాఱిపోయె నట ! తుదకాతడు 'కలితురె' యనుప్రదేశమున బట్టువడి వాని సన్నిధికి గొనిరాబడె నట ! అతడు తరువాత వానినేనుగులచే ద్రొక్కించి చంపించె నట ! ఈమహాద్రోహమును గావించిన యావ్యక్తి పేరేమో యేపోర్చుగీసు చరిత్రకారుడును నుడువ సాహసింపలేదు.

పిమ్మట రామరాయలు నూఱువేలవరహా లిచ్చినవారిని మరల వారిపురమునకు బంపుదు ననియు, అందుసగము ముందుచెల్లింపవలెననియు, తక్కినసగము సంవత్సరముజరిగిన వెనుక చెల్లింప వలసినదనియు శాసింపగా వెంటనే సగము చెల్లింప బడెనట ! తక్కినసగము చెల్లించువఱకును వారిలో ముఖ్యుల నైదుగురను తాకట్టుగ దనతో నుంచుకొనుట కొప్పుకొనియె నట ! వారిసొత్తు నంతయు వారలకు దిరుగ నిచ్చి