పుట:Aliya Rama Rayalu.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చున్నారు. ఆసమయమున నాపట్టణమున నున్నయొకగోవా వర్తకుడు (వానిజాతివాడే) గ్రామములోని పెద్దలను, నాయకులను రప్పించి రాయలకు మందుగుండుసామానుతక్కువ గనుక రాయలసైన్యము నెదురించుట సాధ్య మనియు నాతనికంటె వారలకు సముద్రము కూడ నదనముగా నున్నదిగావున నాతనిసైన్యముల నిరోధించుటయె తగుమార్గ మనికూడ బోధించె నట ! తమపట్టణము విజయనగర సామ్రాజ్యములోనిది గావునను, సామ్రాజ్యభారమును వహించినపాలనకర్తను ధిక్కరించుట సమంజసము కానందునను ధిక్కరించినను సుస్థిరముగా నిలుచుట సాధ్యముగా దనియు వారుతలంచి యాతనిసలహా నిరాకరించి రట ! తనసలహాను వారాదరింపలే దనికోపించి యావర్తకు డొకవర్తకపునావనెక్కి గోవానగరమునకు వెడలిపోయె నట ! అటుపిమ్మట గృహస్థులలో ముఖ్యులగువారిని నల్వురను నాలువేలవఱకువరహాల కాన్కతో రామరాయల కెదురుగ రాయబారము నడపుటకై పంపి రట. రామరాయలు పోర్చుగీసువారు పంపినకాన్కకును, రాయబారమునకు మిక్కిలిసంతోషించె నట ! ఈలోపల నాతనికి స్వాగతము నొసంగుటకై తమపట్టణము నంతయు జక్కగా నలంకరించి రట ! అట్లు రామరాయలు పట్టణమునకు విచ్చేసి యొకవిశాలమైన ప్రదేశమున దండువిడిసి పురములోని యాబాలవృద్ధులుసహా యావత్ర్పజలను రప్పించి తనసంతోషమును తెలుపుటకుగాను వారలకు నొకగొప్పవిందు గావించి యాసమయమున దనసేనాను