పుట:Aliya Rama Rayalu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపోర్చుగీసుక్రైస్తవమతగురువులు చేసినదుండగములను గూర్చి బ్రాహ్మణు లప్పటప్పట రామరాయలకు విజ్ఞప్తులు పంపుచున్నను నాత డుపేక్ష వహించె నట ! పోర్చుగీసువారు గుఱ్ఱములవ్యాపారముచేయు వర్తకులగుటచేతను, రామరాయలకు గుఱ్ఱము లత్యావశ్యకములై యుండుటచేతను, వారితోవిరోధము పెట్టుకొనుట కిష్టములేకుండె నట ! అయినను మహమ్మదుమతస్థు లగుదక్కనుసుల్తానులతో యుద్ధములు జరుపుచుండినవా డగుటవలన నాతనికి ధనము కావలసివచ్చెనట ! తనదేశమునకును తనమతమునకును ద్రోహియైన యొక పోర్తుగల్‌దేశస్థుడు దుర్మార్గుడై సెంటుథోమునందు నివసించు పోర్చుగీసువారికడ విశేషముగా ద్రవ్యముగలదనియు వారిని ముట్టడించినయెడల వారివలన నిరువదిలక్షలబంగారు పూలవరహాలు లభింప గలవని దండయాత్రనడపు మనిప్రోత్సహించె నట. సామ్రాజ్యసంరక్షణముకొఱకును, దక్కనుసుల్తానులతో యుద్ధములు నడపుటకును ద్రవ్యాపేక్ష కలిగియున్నవా డగుటచేత రామరాయ లాతనిదుస్సలహా నంగీకరించి యైదులక్షల సైన్యముతో సెంటుథోముపై దండెత్తి వచ్చె నట ! ఫాదిరి గ్షేవియరు తెలిపినదానినిబట్టి సెంటుథోమునందు నివసించుపోర్చుగీసువారు వివాహములు చేసికొన్నవారుకలుపుకొని నూర్గురు కన్న నెక్కువమందిలేరు. 'పిచ్చుకమీదబ్రహ్మాస్త్ర' మన్నట్టు వీనిని సాధించుటకై రామరాయ లైదులక్షలసైన్యముతో దండెత్తవలసివచ్చిన దనిపోర్చుగీసులేఖకులు వ్రాయు