పుట:Aliya Rama Rayalu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హనమెందుకో? హీరాసుఫాదిరి యింకొక విచిత్రచరిత్రమును గ్రంథథ చేసి యున్నాడు.

సెంటుథోముపై దండయాత్ర

అళియరామరాయలజీవితచరిత్రములో 1558 సంవత్సర మత్యంతప్రాముఖ్యత వహించినదిగా నున్నది. ఎందుకన నింతకు బూర్వము రామరాయ లహమ్మదునగరసుల్తానుపక్షమ ను వహించి విజాపురసుల్తానుతో బోరాడుచుండు వాడు. అట్లుగాక యీసంవత్సరము విజాపురసుల్తానుపక్షము నవలంబించి యహమ్మదునగరము, గోల్కొండసుల్తాను లగుహుస్సేనునిజాముషా, ఇబ్రహీమ్‌ కుతుబ్షాలతో ఘోరమైనయుద్ధముచేసి విజయము గాంచినాడు. ఈవిషయమును తన గ్రంథమున హీరాసుఫాదిరి తెలిపియే యున్నాడు. ఇందలివివరణ మీగ్రంథములోని మూడవప్రకరణమున దెలుప బడినది. కానియీసంవత్సరమే అళియరామరాయ లైదులక్షలసైన్యముతో దూర్పుతీరమున మైలాపురమునకు సమీపమున నున్న 'సెంటథోము' అనుచిన్నపట్టణముపై దండయాత్ర వెడలెనని హీరాసు వ్రాయుచున్నాడు. ఇయ్యది పోర్చుగీసువారి చరిత్రలలో గాన్పించుచున్న దట ! మహమ్మదీయ చరిత్రకారులుగాని హిందూగ్రంథకర్తలుగాని యీదండయాత్రను గూర్చి తెలిపి యుండలేదు.