పుట:Aliya Rama Rayalu.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"అదిమే మెఱుంగముగాని హిందూశాసనములలోగాని, పాశ్చాత్యచరిత్రలలోగాని యుదాహరింప బడియుండలే దని యెఱుంగుదుము" అని తమకుదామే ప్రత్యుత్తర మిచ్చియున్నారు. ఎట్లయినేమి ? ఈ 1558 సంవత్సరముతో నాతని దక్షిణదేశపాలనాధికారప్రభుత్వము తుదముట్టిన దనివక్కాణించిరి. పైకథను వ్రాసినఫాజాగారే 1560 సంవత్సరములో విఠలుడు దక్షిణదేశమున నున్నవాడని వ్రాసియున్నప్పటికిని యితరపోర్చుగీసు గ్రంథములకు భిన్నముగానుండుటచేత హీరాసుఫాదిరి తానువిశ్వసింప జాల డట ! [1] ఆహా! ఎట్టి నిష్పక్షపాతమైనచరిత్రమును వ్రాయసమకట్టిరి? ఇట్టికథలు కల్పించి చెప్పెడువారు చెప్పినను వినువారికైన మతు లుండవని హీరాసుఫాదిరితలంపు గాబోలు ! ఈవిఠలు డీదండయాత్రలో బొందినవిజయ మంతవిశేషమైనదిగాకపోయినను రామరాజీయ మనుగ్రంథములో నళియరామరాయలను "కన్యాకుమారీభీమరధీతలాంతనిక్షేపవిజయస్తంభ" యని స్తుతింపబడినా డట ! అళియరామరాయలనుగూర్చిన యీపొగడ్త లేక యాయనకిచ్చిన యీబిరుదము హీరాసుఫాదిరి వెటకారమున కేలగుఱి గావలసివచ్చినదో? గ్షేవియరు, ఫెరేజ్‌ఫాదిరీలవాక్కుల కారోపింపబడినమంత్రశక్తి దీనిలో లేదని వీరితలంపు గాబోలు. అళియరామరాయలపేరు చెప్పిన వీరి కింతయస

  1. The Aravidu Dynasty of Vijianagar, p. 162 - 163.