పుట:Aliya Rama Rayalu.pdf/204

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రామవర్మకడ వేయిసైనికులకన్న నెక్కువలే రట. ఇంతస్వల్ప సైన్యముతో నాతని నెదుర్కొన జాలక తిరువడిరాజ్యములోని క్రైస్తవమతబోధసంఘమునకు బెద్దయధికారి యగుఫాదిరి 'ఫెరేజ్‌' అనునాయనకడకు నొకదూతను బంపితనసేనకు జయము కలుగు నట్లుగా దేవుని బ్రార్థింపవలసినదిగా గోరె నట ! కాల్కుల మనుప్రదేశమునం దున్నయాఫాదిరి యట్లు చేయుటకు వాగ్దత్తచేసి యాతడొక జెండానడుమ జీసస్సుని నామమును రంగుతో వ్రాయించి దీనిని సైన్యమునకు ముందుంచుకొని యుద్ధముచేయునపుడు జీసస్సునామమును స్మరించు చుండవలసిన దనిచెప్పి యాదూత కిచ్చిపంపె నట ! అట్లు కావింపబడె నట ! ఈస్మరణఘోష విని తెలుగుయోధులు బెగ్గడిలిపోయి పఱువిడగా రామవర్మసైనికులు వారిని వెంటాడించి తఱిమి యనేకులను నఱకి వైచి రట ! ఈజెండా రాజుగారి ధనాగారమున నుంచబడిన దట. ఈకథను వ్రాసిన ఫాదిరి సౌజాకధాంతమున నిట్లు వ్రాసె నట ! "ఈరాజ్యమునుగుఱించి యిక నేనేమియు జెప్పదలంచుకొనలేదు. ఎందుచేత నన లిఖితపత్రములలో నేమియు నేను గనుపెట్ట లేకుండుటయే."

ఈవాక్యములను గ్రంథస్థము గావించి హీరాసుఫాదిరి యాదిగువను 'ట్రావెన్కూరునుండి తనసైన్యముతో వెనుదీయునపుడు విఠ్ఠలుడు చంప బడెనా ?' యని ప్రశ్నించి