పుట:Aliya Rama Rayalu.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ష్ట్యమునకు బూనుకొనవలసి వచ్చెను? ఆకారణము గూడ స్పష్టపడ గలదు. ఉన్నికేరళవర్మ విఠ్ఠలునకు స్వాధీనుడు గాక పోర్చుగీసుఫాదిరీల యండనుజేరియున్నను తిరువడిరాజ్యము సంపూర్ణముగా జయింపబడినతరువాత మూడుసంవత్సరముల కాలము, విజయనగరసేనానులవశమై యున్న దనియే యూహింపవలసి యుండును. ఆకారణముచేతనే పోర్చుగీసువారారాజ్యములోని దేవళములను కొల్లగొనుట సంభవించినది. ఈవిపత్తునుండి దేశము నుద్ధరించుటకై 1545 సంవత్సరాంతముననో ప్రారంభముననో చక్రవర్తియాజ్ఞానుసారము విఠ్ఠలుడు గోవానగరముపై దొడ్డసంకన్ననాయకునితోడ్పాటుతో దండెత్తిపోయియుండును. అట్లు వెడలునపుడు దక్షిణదేశము నంతయు బరిపాలించుభారము తనతమ్ముడయిన చిన్నతిమ్మరాజుపై బెట్టి యుండును. ఆదండయాత్ర విఠ్ఠలున కనుకూలముగా బర్యవసించినందువలనను గోవాగవర్నరు ఖైదిగా బట్టువడినందువలనను పోర్చుగీసువారు 1546 సంవత్సరము ఫిబ్రవరినెలలో సంధిచేసికొనవలసివచ్చినది. ఉన్నికేరళవర్మయు, ఆతనిమిత్రు డయిన ఫాదిరిఫ్రాన్సిస్‌గ్షేవియరును విఠ్ఠలునితో సంధిచేసికొనవలయునని యెంతప్రయత్నించినను వీరు చెప్పినపద్ధతులకు నాత డొప్పుకొనకపోవుటకు గారణము పోర్చుగీసుఫాదిరీలదుస్తంత్రమార్గములేగాని యన్యములు గావు. తుదకు సంధికార్యము నెఱవేఱుటకు బూర్వమే ఉన్నికేరళవర్మ మృతినొందుట సంభవించినది. తుదకు గత్యంతరము లేక వానికుమారుడు విఠ్ఠలుని