పుట:Aliya Rama Rayalu.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తోడను బోరాడు చున్నకాలమున ననగా 1544 సంవత్సరమున గోవాగవర్నరుగా నున్న 'మార్టిమ్‌అప్ఫాన్సోడిసౌజా' అనునాతడు తిరుమల దేవస్థానమున దేవుని విగ్రహము క్రిందను బంగారము ధనము విశేషముగా స్థాపితమై యున్న దని తెలిసికొని దాని నపహరించుటకై 45 యుద్ధనావలను 27 గురుకెప్టనుల యధికారమున నుండువానిని సిద్ధముగావించి తూర్పుతీరమునకు బంపుటకై ప్రయత్నించె నని ఫెరియాయి - సౌజా వ్రాసియుండె నని హీరాసుఫాదిరియె తెలిపి యున్నాడు. కాని వీరిప్రయత్నము సఫలీకృతముకాక మఱియొకవిధముగా బరిణమించిన దట ! ఈవార్త యళియరామరాయలకు దెలియవచ్చి నందున నాతడు దానికిం దగినరక్షకసైన్యమును వెంటనే పంపియుండె నన్నవార్త గోవాగవర్నరునకు దెలియ వచ్చెనట. అందుచే నాత డాప్రయత్నమును విడిచి యా నావికాబలమును తిరువడిరాజ్యమునకు బంపగా వారారాజ్యములోని దేవాలయములను దోచుకొని రట ! ఇట్లని కోరియా దెలుపు చున్నట్టు హీరాసుఫాదిరియే తనగ్రంథమున వక్కాణించి యున్నాడు. ఇప్పుడు విఠ్ఠలుడు గోవానగరముపై దండయాత్ర సాగింపవలసివచ్చినకారణమును చదువరులు చక్కగా గ్రహింప గలరు. శివతత్త్వరత్నాకరమున జెప్పబడినవృత్తాంత మసత్య మనుటసమంజసముగా గన్పట్టదు. ఇక్కడ చదువరులకు మఱియొకశంక కలుగవచ్చును. తిరువడి రాజ్యాధిపతి తమకుమిత్రు డేయైయున్నపుడు వీరేల యిట్టిదౌ