పుట:Aliya Rama Rayalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోడ్పడి యిట్టిమహాకార్యమును నిర్వహించినందుకు సంతోషించి చక్రవర్తివానికి మహాదేవపురమును బహుమానముగా నొసంగెను. ఈవృత్తాంతము శివతత్త్వరత్నాకరమున దెలుపబడినది. [1]

విఠ్ఠలరాయలు వేంకటాద్రివంటిమహాయోధుడుగాని సామాన్యుడు గాడు. అప్రతిమాన ప్రతాపాడ్యుడు. ఇతడు కృష్ణదేవరాయల పూర్వదిగ్విజయయాత్రలో బాల్గొనియుండినవా డగుటచే నప్పటినుండియు సామ్రాజ్యమున వన్నెగాంచిన యోధులలో నొక్కడుగా నుండెను. ఇతడు రామరాయలకు బెదతండ్రికుమారు డగుటచేత వారలతో సమానవయస్సుగలవా డయియుండు ననుటకుసంశ యింప బనిలేదు.ఇత డట్టివాడగుటచేతనే దోనూరికోనేరునాధకవి తనపద్య బాలభాగవతమున నిట్లభివర్ణించి యున్న వాడు.

  1.     
              "సచప్రాప్యానుజాభ్యాశంతేనసాక మపరత్త|
               అనంతరంపరంజ్గెషసార్వభౌమవిరోధిషు||
               పునరేవసమానాయ్యమేళయిత్వానుచేతనమ్|
               నామ్నావిఠ్ఠలరాజేనయాపయామాసతాన్ర్పతి||
               తతస్తాన్వైరిణో రాజాగోవాదేశనివాసిన:|
               పరాభవక్సార్వభౌమౌనుజేనసహసజ్ఞత:||
               తతోగోవాపురాధీశంతస్మైజిత్వార్పయత్యతి|
               అస్మిన్ర్పముదిత:ప్రాదాన్మహాదేవపురస్తలమ్||"
                             (శివతత్త్వరత్నాకరమ్)

               Sources of Vijianagar History, p. 340