పుట:Aliya Rama Rayalu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్షేవియరు తనజాబులలో నెచ్చటను నీమహత్తర విషయమునుగూర్చి యొక్కమాటయైన వ్రాసి యుండలే దట ! అయిన నిదియెంతవిపరీతముగా గన్పట్టినను నిష్పక్షపాత మైనట్టియు, విమర్శాపూర్వక మైనట్టియు చరిత్రముకా దనితిరస్కరింపజాల దట ! ఇందలిసత్య మేమన దిరువడిరాజ్యాధిపతి యైన 'ఉన్నికేరళవర్మను' వశ్యునిజేసికొని ఫాదిరిప్రాన్సిస్‌గ్షేవియరే వానిని గప్పము గట్టకుండ విజయనగర సామ్రాజ్యము నెదుర్కొనజేసి యుండవలయును. ఉన్ని కేరలవర్మకు నీఫాదిరి యత్యంత మిత్రుడుగానుండి యుండెను. ఈపోర్చుగీసుఫాదిరీలు కొందఱు విజయనగరసామ్రాజ్యమునకు గర్భశత్రువులుగానుండి రనికొందఱ వ్రాతలవలన స్పష్టపడ గలదు. వీరిదుర్బోధనలను వినియు, వీరిసాహాయ్యమును నమ్ముకొనియు బరవజాతివారు సుఖముగా నున్నతమస్థితిని జెఱచుకొని యాకాలమున విజయనగరసామ్రాజ్యము నెదుర్కొని కష్టములపా లయిరి. ఈయుద్ధములలో విజయనగరసైన్యము లెచ్చటను నపజయము బొందియుండలేదని స్పష్టముగా వక్కాణించుటకు దగినయాధారములు లేకపోలేదు. 1547 వ సంవత్సరమున (శా. శ. 1469 ప్లవంగనామ సంవత్సరము) ద్విపదబాలభాగవతమును దోనూరికోనేరునాధకవి రచించి యీదండయాత్రలో నుండి విజయము గాంచినయారవీటిచినతిమ్మరాజున కంకితము గావించెను. ఈకవి యీమహావీరునితో గూడ నుండినవాడగుటచేతనే యీదండయాత్రాసందర్భమున చినతిమ్మరాజు