పుట:Aliya Rama Rayalu.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చిప్పలను దేవితెచ్చుట కులవృత్తిగా గలపరవజాతివారు లబ్బెలతో విరోధము పెట్టుకొనిరి. మధురనాయకుడు లబ్బెలపక్షముననుండుటచేత పరవజాతివా రాకాలమున దక్షిణదేశమునకు జేరిన పోర్చుగీసుఫాదిరుల యండజేరి క్రైస్తవమతము నవలంబించి మహమ్మదుమత మవలంబించిన లబ్బెలతో జరుగుపోరాటములందు పోర్చుగీసువారి తోడ్పాటును బొందుచు మధురనాయకుని నలక్ష్యభావముతో జూచుటయెగాక పాండ్యదేశమున గలవరము పుట్టించు చుండిరి. ఇంతియగాక మొదటవచ్చిన ఫ్రాన్సిస్కానుక్రైస్తవ సన్యాసులును, జెస్యూటుక్రైస్తవ సన్యాసులును హిందూదేవాలయములను బగులగొట్టి క్రైస్తవ దేవాలయముల గట్టుటకు బ్రారంభించిరి. ఇందు మొదటివారు సింటుథోము (మైలాపురము) నందును నాగూరు నాగపట్టణమునందును గట్టించిరి. 1542 వ సంవత్సరములో నిట్టిక్రైస్తవాలయములు నాగపట్టణమునందు రెండు నిర్మింప బడినవి. ఆసంవత్సరమున మూడువేలమంది కాథలిక్కుమతము స్వీకరించిరి. ఈపరవజాతివారు క్రైస్తవులయినది మొదలుకొని హిందూప్రభువయిన విశ్వనాథనాయకునికి లొంగియుండక కప్పముగట్ట నిరాకరించిరి. విజాతీయులయిన పోర్చుగీసువారి సాహాయ్య ముండుటవలన వారిని వశ్యులనుగా జేసికొనుట సాధ్యముగాక యాతడు విజయనగర