పుట:Aliya Rama Rayalu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

విఠలునిదక్షిణదేశ దండయాత్ర

సదాశివదేవరాయనికి బూర్వము విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన యచ్యుతదేవరాయలు జయించినది మొదలుకొని తిరువడిరాజ్యము (Travancore) విజయనగరసామ్రాజ్యమునకు గప్పముగట్టుచుండెను. 1541 సంవత్సరమున నచ్యుతదేవరాయలు మరణము జెందుటయును, విజయనగరమున సలకముతిమ్మరాజు రాజ్యము నపహరించుటకు బ్రయత్నించుటయు నేతన్మూలమున సంభవించిన విప్లవమును బురస్కరించుకొనియు దిరువడిరాజ్యమును బరిపాలించుచున్న 'ఉన్నికేరళవర్మ' యను నామాంతరము గలభూతలవీరశ్రీవీరకేరళవర్మ యనురాజు కప్పమును గట్టుట మానుకొనియెను. అదియునుంగాక యాకాలమున విజయనగరసామ్రాజ్యసామంతనృపతులలో నొక్కడగువిశ్వనాధ నాయకుడు మధురాపురము రాజధానిగా బాండ్యమండలమును బరిపాలించు చుండెను. ఈతనిపరిపాలనమునకు లోబడి తెంకాశ రాజధానిగా దిన్నెవెల్లిసీమను బరిపాలించు పంచపాండ్యులనువా రాతనికి శత్రువులై యలజడి కలిగించు చుండిరి. మఱియు దూర్పుసముద్ర తీరమున సముద్రమునుండి ముత్తెపు